sahajavaiShNavAcAravartanula - Annamayya/annamacarya lyrics/spiritual/devotional/traditional/top songs/Audio/videos/telugu/english
5:35 AM S - Annamayya
ప||
సహజవైష్ణవాచారవర్తనుల- | సహవాసమె మాసంధ్య ||
చ||
అతిశయమగు శ్రీహరిసంకీర్తన | సతతంబును మాసంధ్య |
మతి రామానుజమతమే మాకును | చతురత మెరసిన సంధ్య ||
చ||
పరమభాగవత పదసేవనయే | సరవి నెన్న మాసంధ్య |
సిరివరుమహిమలు చెలువొందగ వే- |సరక వినుటె మాసంధ్య ||
చ||
మంతుకెక్క తిరుమంత్ర పఠనమే | సంతతమును మాసంధ్య |
కంతుగురుడు వేంకటగిరిరాయని | సంతర్పణమే మాసంధ్య ||
pa||
sahajavaiShNavAcAravartanula- |
sahavAsame mAsaMdhya ||
ca||
atiSayamagu SrIharisaMkIrtana |
satataMbunu mAsaMdhya |
mati rAmAnujamatamE mAkunu |
caturata merasina saMdhya ||
ca||
paramaBAgavata padasEvanayE |
saravi nenna mAsaMdhya |
sirivarumahimalu celuvoMdaga vE- |
saraka vinuTe mAsaMdhya ||
ca||
maMtukekka tirumaMtra paThanamE |
saMtatamunu mAsaMdhya |
kaMtuguruDu vEMkaTagirirAyani |
saMtarpaNamE mAsaMdhya ||
No comments:
Post a Comment